
శివ్వంపేట, వెలుగు: కుక్కల దాడిలో 28 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బండ యాదయ్యకు మొత్తం 60 గొర్రెలు ఉన్నాయి. వాటిని మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యాదయ్య రోజు మాదిరిగానే గొర్రెలు మేపి షెడ్డులో గొర్రెలను తోలి ఇంటికి వెళ్లాడు.
మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి గొర్రెల మందపై కుక్కలు దాడి చేసి 28 గొర్రెలను గాయపరచడంతో మృతి చెందాయి. 15 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. గొర్రెలు మృతి చెంది రూ.2 లక్షల నష్టం జరిగిందని బాధితుడు యాదయ్య బోరున విలపించాడు.