రష్మిక లైఫే మారిపోయిందిగా.. ఆమె ఏడాది సంపాదన ఎంతో తెలిస్తే.. తోటి హీరోయిన్లు కుళ్లుకోవాల్సిందే..!

రష్మిక లైఫే మారిపోయిందిగా.. ఆమె ఏడాది సంపాదన ఎంతో తెలిస్తే.. తోటి హీరోయిన్లు కుళ్లుకోవాల్సిందే..!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ క్వీన్. రష్మిక మందన్న అతి తక్కువ సమయంలోనే పాన్-ఇండియా హీరోయిన్ గా ఎదిగింది. పుష్ప శ్రీవల్లి నుండి యానిమాల్ గీతాంజలి, ఛావా మహారాణి యేసుబాయి వరకు, రష్మిక తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

రష్మిక మందన్న ఏడాది సంపాదన:

రష్మిక మందన్న రెండేళ్లలో నటించిన మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలు (యానిమాల్,పుష్ప 2, ఛావా) ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.3300 కోట్లు వసూళ్లు సాధించాయి. ఈ వసూళ్ల సునామీతో బాలీవుడ్ టాప్ హీరోయిన్లను సైతం రష్మిక వెనక్కి నెట్టింది. దాంతో రష్మిక మందన్న ఏడాదికి ఎంత సంపాదిస్తుంది? తనకున్న స్టార్ డంతో ఎలాంటి లగ్జరీ ఎస్టేట్స్ మరియు ఇతర ఆస్తుల వివరాలు ఎలా ఉన్నాయనే లెక్కలు వైరల్ అవుతున్నాయి.

ఫోర్బ్స్ ప్రకారం:

28 ఏళ్ల రష్మిక మందన్న నికర విలువ రూ.66 కోట్లు అని తెలుస్తోంది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' మూవీకి   ఆమె రూ.10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ET ప్రకారం రష్మిక  ఒక్కో సినిమాకు దాదాపు రూ. 4 కోట్లు సంపాదిస్తుంది.

అంతేకాకుండా, రష్మిక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, యాడ్స్ మరియు ఈవెంట్ షోస్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని అదనంగా సంపాదిస్తుంది. ఆమె బోట్, కళ్యాణ్ జ్యువెలర్స్, 7UP, మీషో వంటి బ్రాండ్‌లను ఎండార్స్ చేస్తుంది. పలు నివేదికల ప్రకారం.. ఆమెకు బెంగళూరులో రూ.8 కోట్ల విలువైన ఒక బంగ్లా, ముంబై, గోవా, కూర్గ్ మరియు హైదరాబాద్‌లలో స్థిరాస్తులు ఉన్నట్లు సమాచారం. 

ALSO READ | Comedy OTT: అఫీషియల్.. ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

రష్మిక దగ్గర వివిధ రకాల హై-ఎండ్ వాహనాలు ఉన్నాయి. ఆమె కార్ల సేకరణలో రూ.11 లక్షల నుండి రూ.1.64 కోట్ల వరకు ధర కలిగిన వాహనాలు ఉన్నాయి. వాటిలో మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా, టయోటా ఇన్నోవా మరియు ఆడి క్యూ3 ఉన్నాయి. వివిధ నివేదికల ప్రకారం 2023లో ఆమె నికర విలువ దాదాపు రూ. 45 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పుడు 2025 నాటికి అది రూ.66 కోట్లు ఉంటుందని అంచనా!

బాలీవుడ్ హీరోయిన్లను వెనక్కి నెట్టి:

ఇపుడు ఆమె ఏడాది సంపాదన చూసి తోటి స్టార్ హీరోయిన్లు కుళ్లుకునేలా రష్మిక లైఫే మారిపోయింది. బాలీవుడ్ లో చూసుకుంటే ఒకప్పుడు గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా టాప్ నటిగా పేరుగాంచింది. ప్రియాంక హాలీవుడ్ కు వెళ్లిపోయిన తర్వాత ఆమె స్థానాన్ని దీపికా పదుకోనే సొంతం చేసుకుంది. దీపికా కూడా కొన్నేళ్లుగా బాక్సాఫీస్ ను శాసిస్తుంది. ఇప్పుడు రష్మిక రూపంలో దీపికా పదుకోనేకు గట్టి పోటీయే ఎదురైంది. ఇకపోతే, అలియా భట్, కత్రినా కైఫ్, కరీనా కపూర్ లను రష్మిక వెనక్కి నెట్టిందనే చెప్పుకోవాలి. 

రష్మిక మందన్న సినీ ప్రస్థానం:

రష్మిక మందన్న కన్నడ సినిమా కిరిక్ పార్టీ (2016) తో అరంగేట్రం చేసి, అంజని పుత్ర (2017) మరియు చమక్ (2017) సినిమాలతో కీర్తిని సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో గీత గోవిందం (2018) సినిమాలతోనూ, ఆ తర్వాత యానిమల్ (2023), పుష్ప 1 మరియు 2 సినిమాలతోనూ గుర్తింపు పొందింది. ఇక లేటెస్ట్ ఛావా తో మరింత గుర్తింపు దక్కించుకుంది. 

రష్మిక మందన్న 2025 సినిమాలు:

2025 ఏడాది రష్మిక మందన్న నుంచి మరిన్ని బ్లాక్ బస్టర్ గా నిలవగలిగే మూవీస్ రాబోతున్నాయి. అందులో ఒకటి సల్మాన్ ఖాన్ తో కలిసి ఆమె నటిస్తున్న మూవీ సికందర్. ఈ మూవీ రంజాన్ పండగకు రిలీజ్ కానుంది.

ఇక ఆ తర్వాత నాగార్జున, ధనుష్ లతో కలిసి శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న 'కుబేర' కూడా రాబోతోంది. ఇవే కాకుండా 'ది గర్ల్‌ఫ్రెండ్' లోనూ ఆమె నటిస్తోంది. దీంతో ఈ ఏడాది రష్మిక జోరు మరింత ఎక్కువగా ఉండనుంది.