ధర్మారం, వెలుగు: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పోలీసుల వాహన తనిఖీ లో 2.80లక్షలు నగదు పట్టుకున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
మంగళవారం వాహన తనిఖీలు చేస్తుండగా చొప్పదండికి చెందిన అంజయ్య, కుమార్, మల్లయ్య. అంజయ్య, లచ్చయ్య దగ్గర 2,25,000 అలాగే ధరవత్ ఠాగూర్, లోకవత్ దేవేందర్ వద్ద 55,000 నగదు దొరికింది ఈ నగదుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.