ఇందిరమ్మ ఇళ్ల కోసమే 2,865 దరఖాస్తులు

ఇందిరమ్మ ఇళ్ల కోసమే 2,865  దరఖాస్తులు

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్​ ఫూలే ప్రజాభవన్‌‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 4,901 దరఖాస్తులు వచ్చినట్టు ప్రజావాణి అధికారులు తెలిపారు.  వాటిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం 2,865,  పౌరసరఫరాల శాఖ రేషన్​ కార్డుల కోసం1640,  పంచాయతీరాజ్​గ్రామీణ అభివృద్ధికి 157, విద్యుత్​ శాఖకు సంబంధించి 105, రెవెన్యూ సమస్యలపై 30,  ఇతర శాఖలకు సంబంధించి 109 వచ్చాయి.  

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు  డాక్టర్​ చిన్నారెడ్డి ప్రజలనుంచి దరఖాస్తులను స్వీకరించారు.