అబ్దుల్లాపూర్మెట్, వెలుగు: పెద్ద అంబర్పేట్ మున్సిపల్సర్వసభ్య చివరి సమావేశాన్ని చైర్పర్సన్ పండుగుల జయశ్రీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఎజెండా అంశాలపై చర్చించి, 24 వార్డులకు రూ.50 లక్షల చొప్పున అభివృద్ది పనులను కేటాయించారు. అలాగే తట్టిఅన్నారంలో 16 కాలనీలకు సంబంధించిన మురుగు నీటి ట్రంక్ లైన్నిర్మాణానికి రూ.10 కోట్లు, పెద్ద అంబర్పేట్ నుంచి పసుమాముల వరకు గతంలో మంజూరు చేసిన ట్రంక్లైన్ నిర్మాణానికి రూ. 6 కోట్లు, మున్సిపాలిటీలో విలీనమైన నాలుగు కొత్త గ్రామాల అభివృద్ధి కోసం రూ. కోటి నిధులకు ఆమోదం తెలిపారు.
సమావేశానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి సహకారంతో అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గ పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలకు రూ.114 కోట్లు
కేటాయించినట్లు చెప్పారు.