మెహిదీపట్నం, వెలుగు: హుమాయున్ నగర్లో 14.5 కిలోల గంజాయి పట్టుబడింది. గుడిమల్కాపూర్‌కు చెందిన హజారీ దినేశ్ సింగ్ అలియాస్ టింకు (35) కైట్ మేకర్. ఒడిశాకు చెందిన అజిత్ నాయక్ (26), జీసెస్ మాలి (22) వద్ద గంజాయి కొనుగోలు చేసి, ధూల్‌పేటకు చెందిన సుశీల్ సింగ్ (28), ముకేశ్ సింగ్ (28), శివసింగ్ (28)కు సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారంతో ఈ ఆరుగురిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
జీడిమెట్ల: మరో కేసులో మచిలీపట్నం నుంచి సిటీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని మేడ్చల్ఎక్సైజ్టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్ట్‌చేశారు. మచిలీపట్నానికి చెందిన బలగం నాగరాజు (33), అన్వేశ్ (33) గంజాయి సరఫరా చేస్తుంటారు. కూకట్‌పల్లికి చెందిన రఫీకి సరుకు ఇవ్వడానికి శుక్రవారం సుచిత్ర చౌరస్తా వద్ద వేచి ఉన్నారు. విశ్వసనీయ సమాచారంతో వీరిని అరెస్ట్ చేశారు. నిందితుల 8.74 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
శామీర్ పేట: శామీర్ పేటలో బైక్ పై గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 6 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు.