హైదరాబాద్లో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫుల్ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్లో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫుల్ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు వస్తుండడమే కారణం

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 29 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ‘ఇండియా రియల్ ఎస్టేట్ క్యూ3 2023' రిపోర్ట్ ప్రకారం, సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిటీలో 53 లక్షల  చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం  పూర్తయింది. దేశంలోని కీలకమైన  ఎనిమిది సిటీలలో డెలివరీ అయిన ఆఫీస్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ వాటా  46 శాతం ఉంది.

 సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిటీలో సగటు ఆఫీస్ స్పేస్ రెంట్ చదరపు అడుగుకు రూ. 65.3  రికార్డయ్యిందని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.   హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఫారిన్ కంపెనీలు తమ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయడం పెరిగింది.  క్యూ3 లో జరిగిన మొత్తం ఆఫీస్ స్పేస్ ట్రాన్సాక్షన్లలో వీటి వాటా 75 శాతంగా ఉండడం దీనికి నిదర్శనం.  దేశంలోని కీలక ఎనిమిది సిటీలలో క్యూ3లో1.61 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. 

కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది ఇవి 17 శాతం  ఎక్కువ.  ‘ ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండడంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరుగుతోంది. గ్లోబల్ కంపెనీలు తమ కేపబిలిటీ సెంటర్లను ఇక్కడ పెడుతున్నాయి’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా  మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ అన్నారు.