కామారెడ్డి, వెలుగు : మాచారెడ్డి పోలీస్ స్టేషన్పరిధిలోని భవానీపేట తండా శివారులో ఉన్న వైకుంఠధామం రూమ్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 29 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సింధూశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. భవానీపేట తండాకు చెందిన మాలోవత్ మోహన్ వైకుంఠధామం రూమ్‌లో
అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారన్నారు. మాలోవత్ మోహన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.