డిసెంబర్ 6 నుంచి 15వ తేదీ వరకు ఈయూ ఫిల్మ్ ఫెస్టివల్

  • 10 రోజులపాటు అవార్డు విన్నింగ్​సినిమాల ప్రదర్శన

హైదరాబాద్ సిటీ, వెలుగు : సిటీలోని ప్రసాద్​ల్యాబ్స్​ప్రివ్యూ థియేటర్​లో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు 29వ ఎడిషన్ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఈయూఎఫ్ఎఫ్) నిర్వహించనున్నారు. సారథి స్టూడియోస్, హైదరాబాద్ ఫిలిం క్లబ్ సంయుక్త నిర్వహణలో ఈ ఫెస్టివల్ జరగనున్నది. 29 భాషల్లో 24 అవార్డులు గెలిచిన చిత్రాలను ఇందులో ప్రదర్శించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 

బెల్జియం, బల్గేరియా, సైప్రస్, చెకియా, డెన్మార్క్, ఎస్టోనియా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఐర్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేనియాకు చెందిన సినిమాలు ప్రదర్శిస్తామన్నారు.