గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు.. రైతు దినోత్సవ వేడుకల్లో  కవిత

గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు.. రైతు దినోత్సవ వేడుకల్లో  కవిత

 తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  రెండో రోజు  రైతు దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.   కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజి వాడిలో   జరిగిన రైతు దినోత్సవం  వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని.. తెలంగాణ ఏర్పడక ముందు రైతుల ఆత్మహత్యలు ఉండేవన్నారు.  బీఆర్ఎస్ ప్రభుత్వంలో  నకిలీ విత్తనాలు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నమన్నారు కవిత.  ఫేక్ సీడ్స్ సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నామన్నారు.  

రైతు సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుచేసుకున్నామన్న  ఆమె.. తెలంగాణ వచ్చాకే గ్రౌండ్ వాటర్ పెరిగిందన్నారు,  కాళేశ్వరం 22 వ ప్యాకేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.  వరిసాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని .. తెలంగాణ రైతులు  లాభదాయకమైన పంటలవైపు దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.