అంతర్జాతీయ గ్రీన్​ హైడ్రోజన్​ సదస్సు హైలైట్స్.. గ్రీన్​ హైడ్రోజన్​ అంటే..

అంతర్జాతీయ గ్రీన్​ హైడ్రోజన్​ సదస్సు హైలైట్స్.. గ్రీన్​ హైడ్రోజన్​ అంటే..

గ్రీన్ హైడ్రోజన్​పై రెండో అంతర్జాతీయ సదస్సు –2024(ఐసీజీహెచ్​–2024) సెప్టెంబర్​ 11 నుంచి 13 వరకు న్యూ ఢిల్లీలోని భారత్​ మండపంలో జరిగింది. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర, సాంకేతికత ద్వారా గ్రీన్​ హైడ్రోజన్​ ఉపయోగాన్ని వేగవంతం చేసేందుకు వ్యూహాత్మక పెట్టుబడులు, భాగస్వామ్యాలను పెంపొందించడం ద్వారా ప్రపంచ హైడ్రోజన్​ పర్యావరణ వ్యవస్థలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే ఈ సమావేశం లక్ష్యం. 

గ్రీన్​ హైడ్రోజన్​ 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌024 రెండో అంతర్జాతీయ సమావేశాన్నిపెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ, సైన్స్​ అండ్​ టెక్నాలజీ డిపార్ట్​మెంట్​, సైంటిఫిక్​ అండ్​ ఇండస్ట్రియల్​ రీసెర్చ్​ డిపార్ట్​మెంట్​తో కలిసి సంయుక్తంగా నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వ ప్రిన్సిపల్​ సైంటిఫిక్​ అడ్వైజర్​ కార్యాలయం నిర్వహిస్తాయి. సోలార్​ ఎనర్జీ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా, ఈవై సంస్థలు అమలు పరిచే, విజ్ఙాన భాగస్వాములుగా ఉన్నాయి. పారిశ్రామిక భాగస్వామిగా ఫిక్కీ ఉంది. ​

 
గ్రీన్​ హైడ్రోజన్​ పాత్ర

ప్రపంచ ఇంధన రంగంలో గ్రీన్​ హైడ్రోజన్​ కీలక పాత్రను పోషిస్తున్నది. విద్యుదుత్పత్తి కష్టసాధ్యంగా ఉన్న పరిశ్రమల్లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇది సాయపడుతుంది. చమురు శుద్ధి కర్మాగారాలు, ఎరువులు, ఉక్కు, భారీ స్థాయి రవాణా తదితర రంగాలు అనేకం దీనివల్ల లాభపడనున్నాయి. 

నేషనల్​ గ్రీన్​ హైడ్రోజన్​ మిషన్​ 

భారతదేశాన్ని గ్లోబల్​ గ్రీన్​ హైడ్రోజన్​ హబ్​గా మార్చేందుకు రూ.22వేల కోట్లతో నేషనల్ గ్రీన్​ హైడ్రోజన్​ మిషన్​ను 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2030 నాటికి కనీసం ఐదు మిలియన్ టన్నుల గ్రీన్​ హైడ్రోజన్​ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది 10 మిలియన్​ టన్నులకు చేరుకుంటూ ఎగుమతులు కూడా చేయవచ్చు. 2030 నాటికి కర్బన్​ ఉద్గారాలను తగ్గించడంతోపాటు స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించడం, 2030 నాటికి 125 గిగా వాట్స్​ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నదే ఈ మిషన్ లక్ష్యం. 

గ్రీన్​ హైడ్రోజన్​ అంటే

ఇది స్వచ్ఛమైన శక్తి. సోలార్​ పవర్​ తదితర పునరుత్పాదక శక్తిని వినియోగించి నీటిని హైడ్రోజన్​గా, ఆక్సిజన్​గా ఉపయోగించే విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే వస్తుంది. కాబట్టి, ఇది పూర్తిగా కాలుష్య రహితం. అందుకే దీనిని గ్రీన్​ హైడ్రోజన్​ అంటున్నారు. 

చమురు శుద్ధి, ఎరువులు, ఉక్కు, సిమెంట్​ తదితర కార్బన్​ రహిత భారీ పరిశ్రమలకు ఇది సహాయపడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ మిషన్​ ద్వారా ఉత్పత్తి చేసే కర్బన్​ రహిత హైడ్రోజన్​ను వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు.