- 2-0తో సిరీస్ సొంతం
- మంధానా, హర్మన్ సెంచరీలు
బెంగళూరు: ఓవైపు స్మృతి మంధానా (120 బాల్స్‌లో 18 ఫోర్లు, 2 సిక్స్‌లతో 136), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103 నాటౌట్).. మరోవైపు లారా వోల్‌వర్ట్ (135 బాల్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 135 నాటౌట్), మరిజేన్ కాప్ (94 బాల్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114) సెంచరీలతో చెలరేగిన రెండో వన్డేలో ఇండియానే విజయం వరించింది. ఆఖరి ఓవర్‌లో సౌతాఫ్రికాకు 11 రన్స్ కావాల్సిన టైమ్‌లో పూజా వస్త్రాకర్ (2/54) వరుస బాల్స్‌లో డి క్లెర్క్ (28), నొడుమిసో షాంగ్సే (0)ను ఔట్ చేసి టీమిండియాను గట్టెక్కించింది. దీంతో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా 4 రన్స్ తేడాతో సఫారీలను ఓడించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. హర్మన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
171 రన్స్ భాగస్వామ్యం..
టాస్ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 325/3 భారీ స్కోరు చేసింది. షెఫాలీ వర్మ (20), హేమలత (24) విఫలమైనా.. ఈ ఇద్దరు కలిసి మంధానాతో 100 రన్స్ భాగస్వామ్యాన్ని అందించారు. ఇక ఆరంభం నుంచే ప్రొటీస్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్న మంధానా వరుసగా రెండో సెంచరీని ఖాతాలో వేసుకుంది. ఓవరాల్ కెరీర్‌లో ఏడో వంద కావడం విశేషం. 100/2 వద్ద మంధానాకు తోడైన హర్మన్ టీ20 స్టైల్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది. లాంగాన్, లాంగాఫ్‌లో మూడు భారీ సిక్స్‌లు కొట్టింది. రెండో ఎండ్‌లో మంధానా కూడా అదే జోరును చూపెట్టడంతో పరుగులు వరదలా వచ్చాయి. ఈ క్రమంలో మంధానా 103, కౌర్ 87 బాల్స్‌లోనే సెంచరీలు పూర్తి చేశారు. ఈ జోడీని విడదీసేందుకు ప్రొటీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోయారు. చివరి వరకు వీరోచితంగా ఆడిన ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 171 రన్స్ జోడించడంతో ఇండియా భారీ స్కోరు సాధించింది. చివర్లో రిచా ఘోష్ (25 నాటౌట్) ఫర్వాలేదనిపించింది. మలాబా రెండు వికెట్లు తీసింది.
రాణించిన లారా, కాప్..
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 321/6 స్కోరు చేసింది. తజ్మిన్ బ్రిట్స్ (5), అనెకా బోష్ (18), సునె లుస్ (12) విఫలం కావడంతో ప్రొటీస్ 67/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో లారాకు జత కలిసిన కాప్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఇండియా బౌలర్లను లెక్క చేయకుండా బౌండ్రీలతో విరుచుకుపడింది. 85 బాల్స్‌లోనే సెంచరీ పూర్తి చేసింది. రెండో ఎండ్‌లో లారా కూడా 119 బాల్స్‌లో వంద అందుకుంది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 184 రన్స్ జత చేసి విజయంపై ఆశలు రేకెత్తించారు. చివర్లో డిక్లెర్క్‌తో కలిసి లారా ఐదో వికెట్‌కు 69 రన్స్ జోడించి విజయానికి చేరువగా తీసుకొచ్చింది. కానీ చివర్లో పూజా సంచలన బౌలింగ్‌తో వరుస బాల్స్‌లో వికెట్లు తీయడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. దీప్తి 2, మంధానా కెరీర్‌లో తొలి వికెట్ తీసింది.