పాట్నా: రైలు పట్టాలమీద కూర్చుని పబ్జీ గేమ్ ఆడుతున్న ముగ్గురు టీనేజర్లను రైలు ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాళ్లంతా చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకుని గేమ్ ఆడుతుండగా అదే రూట్లో వచ్చిన ట్రైన్ వారి పైనుంచి దూసుకెళ్లింది.
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో శుక్రవారం ఈ ఘోరం జరిగింది. మృతులను అదే జిల్లాకు చెందిన ఫుర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో వాళ్లకు రైలు వచ్చే శబ్దం వినిపించి ఉండకపోవచ్చని పోలీసులు చెప్తున్నారు. ముగ్గురు కుర్రాళ్లు పట్టాలపై కూర్చొని ఫోన్లలో
చూస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు.