బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు అయ్యాయి.  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారని..ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్  రిజిస్టర్ చేశారు పోలీసులు.

ఇక సమావేశంలో గందరగోళం సృష్టించారని ఆర్డీవో మహేశ్వర్.. తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని  గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన కంప్లైంట్లపై..పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో  జరిగిన సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.