![లోన్లు ఇప్పిస్తానని రూ. 3 కోట్లు వసూలు చేసిండు](https://static.v6velugu.com/uploads/2025/02/3-crore-fraud-in-jagityala-district-in-the-name-of-pradhan-mantri-yojana-scheme_SVRpXsNLGj.jpg)
జగిత్యాల జిల్లాలో ప్రధానమంత్రి యోజన పథకం పేరుతో భారీ మోసం బయటపడింది. ఓ కేటుగాడు లోన్లు ఇప్పిస్తామని కోట్లు కొల్లగొట్టాడు. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మంది నుంచి 2 కోట్ల 96 లక్షలు వసూలు చేశాడు కేటుగాడు వేణువర్మ అనే వ్యక్తి.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ కు చెందిన కుడిచర్ల వేణువర్మ నాలుగేళ్లుగా ప్రధాన మంత్రి యోజన పథకం ద్వారా ఋణాలిప్పిస్తానని అందరినీ నమ్మించాడు. ఇది నమ్మిన అమాయక ప్రజలు డబ్బులు వస్తాయని బంగారం,నగదు అప్పజెప్పారు. అయితే ఎన్ని రోజులైనా లోన్ ఇవ్వకపోగా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వేణువర్మ కోసం వెతుకుతున్నారు. ఫిబ్రవరి 8న ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రం తీన్ ఖాన్ చౌరస్తా దగ్గర వేణువర్మను పట్టుకున్న బాధితులు పోలీసులకు అప్పగించారు. అయితే సుమారు 30 కోట్లకు పైన వసూలు చేసినట్టు ఆరోపిస్తున్నారు బాధితులు.