ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని 14 అంతస్తుల అపార్ట్ మెంట్ లో అక్టోబర్ 16న ఉదయం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదపులోకి తెచ్చారు. రెండు మూడు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
Also Read :- ఇంజినీరింగ్ కాలేజీలను ముంచెత్తిన వరద
అంధేరీ ప్రాంతంలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్ దగ్గర ఉన్న రియా ప్యాలెస్ భవనంలోని 10వ అంతస్తులో ఉదయం 8 గంటల సమయంలో మంటలు చెలరేగాయని అధికారి తెలిపారు. గాయపడ్డ ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారని చెప్పారు. మృతులను చంద్రప్రకాష్ సోని (74), కాంత సోని (74), పెలుబేట (42)గా గుర్తించామన్నారు. కేసు నమోదు చేసిన అధికారులు అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.