
నెలల వయసున్న పిల్లలకు స్నానం చేయించడానికి తల్లులు చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే వాళ్లు అమ్మ సాయం లేకుండా కూర్చోలేరు. నిలబడలేరు. అలాంటివాళ్లకోసం వీపీజీఎస్ అనే కంపెనీ ఈ బాత్ స్టాండ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఆరు నుంచి 36 నెలల వయసున్న పిల్లలకు సరిగ్గా సరిపోతుంది. దీనికి ఉండే ఆర్మ్‌రెస్ట్‌లు బేబీని పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాయి.
ఇది పిల్లలకు స్నానం చేయించేటప్పుడు, బట్టలు, డైపర్లు మార్చేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. దీని కిందిభాగంలో యాంటీ-స్లిప్ ప్యాడ్స్ ఉండడం వల్ల బేబీ పడిపోకుండా చాలా సేఫ్‌గా ఉంటుంది. దీన్ని సురక్షితమైన పీపీ మెటీరియల్‌తో తయారుచేశారు. కాబట్టి ఎలాంటి వాసన రాదు. దృఢంగా ఉంటుంది. నీళ్లు పడినా త్వరగా ఆరిపోతుంది. ఆర్మ్ రెస్ట్స్ ఎత్తుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ధర : రూ. 1,399
పాటీ ట్రైనింగ్ సీట్
పెద్దవాళ్లు ఉపయోగించే టాయిలెట్ సీట్ మీద చిన్నపిల్లలు కూర్చోలేరు. వాళ్లకు అది అంత కంఫర్ట్‌గా ఉండదు. అలాగని పిల్లల కోసం చిన్న సైజు సీటుని పెట్టించలేం. అందుకే ఇలాంటి పాటీ ట్రైనింగ్ సీట్‌ని కొనుక్కుంటే సరిపోతుంది. దీన్ని జూనియర్ జో అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇన్స్టాల్ చేయడం చాలా సులభం.
టాయిలెట్ సీటుకి బిగిస్తే... పిల్లలు టాయిలెట్‌కు వెళ్లడం, కడుక్కోవడం ఈజీ అవుతుంది. దీన్ని 5 నిమిషాల్లో అసెంబుల్ చేయొచ్చు. పిల్లల ఎత్తుకు తగ్గట్టుగా ఫెడల్ ఎత్తును మార్చుకోవచ్చు. సీటు మీద కూర్చున్నప్పుడు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కుషన్ కూడా ఉంటుంది. ఇది ఒకటి నుంచి ఏడు సంవత్సరాల పిల్లలకు సరిపోతుంది. 70 కిలోల బరువును కూడా తట్టుకుంటుంది.
ధర : రూ. 1,399
షవర్ క్యాప్
పిల్లలకు తల స్నానం చేయించేటప్పుడు కళ్లు, ముక్కు, చెవుల్లోకి నీళ్లు, షాంపూ వెళ్లి ఇబ్బందిపడుతుంటారు. తలకు ఈ క్యాప్‌ని పెడితే ఆ సమస్య ఉండదు. దీన్ని రొలోజీ అనే కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీన్ని హెయిర్ కట్ చేసేటప్పుడు పెడితే వెంట్రుకలు నోట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఈ క్యాప్‌ని ఫోమ్ మెటీరియల్‌తో తయారుచేస్తారు. కాబట్టి బరువు చాలా తక్కువగా ఉంటుంది. చెవుల్లోకి నీళ్లు పోకుండా అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ప్రొటెక్టర్స్ ఉంటాయి. ఒకటి నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు సరిపోతుంది. తల సైజుని బట్టి క్యాప్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ధర : రూ. 116