బెంగళూరు: అంతరిక్ష రంగంలో బెంగళూరుకు చెందిన ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ‘పిక్సెల్’ చరిత్ర సృష్టించింది. ఇమేజింగ్ శాటిలైట్లను ప్రయోగిం చిన తొలి భారత ప్రైవేట్ కంపెనీగా రికార్డ్ నెలకొల్పింది. పిక్సెల్‌కు చెందిన 3 ‘ఫైర్ ఫ్లై’ ఉప గ్రహాలను బుధవారం యూఎస్ కాలి ఫోర్నియాలోని వాండన్ బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి స్పేస్ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయ వంతంగా ప్రయోగించింది.
ట్రాన్స్ పోర్టర్ 12 మిషన్లో భాగంగా మొత్తం 131 పేలోడ్లను ఫాల్కన్ 9 రాకెట్ 550 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో హైపర్ స్పెక్ట్రల్(3డీ) ఇమేజింగ్ టెక్నాలజీతో భూపరిశీలన, వాతావరణ మార్పులపై అధ్యయనం కోసం ఉపగ్రహాలను ప్రయోగించిన తొలి ఇండియన్ ప్రైవేట్ కంపెనీగా పిక్సెల్ నిలిచింది.
ఫైర్ ఫ్లై కాన్ స్టెల్లేషన్ లో భాగంగా మరో 3 అధునాతన హై రెసొల్యూషన్ కమర్షియల్ హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాలను కూడా త్వరలో ప్రయోగించనున్నట్టు పిక్సెల్ కంపెనీ ప్రకటించింది. తొలిసారి ఓ ప్రైవేట్ కంపెనీ ఈ ఘనత సాధించడంపై ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు.