గోవాలో అధికార పార్టీ బీజేపీ ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రతి రోజూ జోరుగా ఇంటింటి ప్రచారం సాగిస్తోంది. మరోసారి అధికారమిస్తే ఏం చేస్తామన్నది వెల్లడిస్తూ ఇవాళ ఆ పార్టీ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం ప్రమోద్ సావంత్ కలిసి విడుదల చేశారు. మరోసారి తమను గెలిపిస్తే ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లను అందజేయడంతో పాటు గోవాలో మత్స్య రంగం, మైనింగ్ పరిశ్రమను డెవలప్ చేస్తామని అందులో పేర్కొన్నారు. ప్రజల సలహాలు, సూచనలను తీసుకుని, వారు కోరుకున్నట్లు తమ మేనిఫెస్టోను రూపొందించామని బీజేపీ తెలిపింది. మానవాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, గోల్డెన్ గోవా అజెండాతో ఈ మేనిఫెస్టోను తయారు చేశామని పేర్కొంది.
మేనిఫెస్టోలో కీలకమైన అంశాలు
- - ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం.
- - భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగకుండా చర్యలు.
- - పేదరిక నిర్మూలన, ఈజ్ ఆఫ్ లివింగ్, యువతకు ఉద్యోగ కల్పన కోసం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధులు.
- - టూరిజంతో పాటు ఇంటర్నేషనల్ మీటింగ్స్, కన్వెన్షన్, కాన్ఫరెన్స్ లకు గోవా డెస్టినేషన్ గా నిలిచేలా అభివృద్ధి.
- - మత్స్య రంగ అభివృద్ధి, రైతుల ఆదాయం పెంపు, మైనింగ్ రంగ అభివృద్ధి.
- - గోవా ఆర్థికాభివృద్ధి, హెల్త్ కేర్ రంగ అభివృద్ధికి కృషి.