రాహుల్ నామినేషన్​తో 3 గంటల ఆలస్యం

రాహుల్ నామినేషన్​తో 3 గంటల ఆలస్యం

ధర్మపురి జన జాతర సభ కు రేవంత్​ రెడ్డి మధ్యాహ్నం హాజరు కావాల్సి ఉండగా, సాయంత్రం వచ్చారు. ఈ విషయంపై సభలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ నామినేషన్ దృష్ట్యా ఉత్తర ప్రదేశ్​లోని రాయ్​బరేలికి వెళ్లడంతో ఆలస్యం జరిగిందని, ర్యాలీలో లేట్ అయినప్పటికీ ధర్మపురికి రావాల్సిందేనని

లక్ష్మణ్ కుమార్ పట్టుబట్టారని వివరించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేల సంఖ్యలో తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థి వంశీని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.