వాషింగ్టన్ డీసీ:అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ అమెరికన్ స్టూడెంట్లు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను భారతీయ సంతతికి చెందిన శ్రియా అవసరాల, అన్వీవర్మ, ఆర్యన్ జోషిగా, గాయపడిన వారు రిత్వాక్ సోమేపల్లి, మహ్మద్ లియాఖత్ గా గుర్తించారు.
జార్జియా రాష్టంలో మే 14 న ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో బలంగా చెట్టును ఢీకొట్టి పల్టీలుకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రియా అవసరాల, అన్వీశర్మ స్పాట్ లో మృతి చెందగా.. అన్వీశర్మ్ నార్త్ ఫుల్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వీరంతా 18 ఏళ్ల లోపు వారే.
శ్రియా అవసరాల, అన్వీవర్మ జార్జియా యూనివర్సిటీ విద్యార్థులు కాగా.. , మహ్మద్, ఆర్యన్ జోషి ఆల్ఫారెట్టా హైస్కూల్‌లో వారికి సీనియర్లు.