
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం రాత్రి పటాన్ చెరు పారిశ్రామిక వాడలోని పాశమైలారంలోని ఓ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి.. ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.