లాహోర్ : పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. లాహోర్‌లోని అనార్కలీ మార్కెట్లో బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు చనిపోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారతీయ వస్తువులు అమ్మే పాన్ మండి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లు, షాపుల అద్దాలు పగిలిపోయాయి. ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ ఘటనకు బాధ్యత వహించలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడుకు ఏ పదార్థాలు ఉపయోగించారన్నది విశ్లేషిస్తున్నారు. బైక్‌లో టైమర్ బాంబు అమర్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పేలుడులో గాయపడిన వారిని మయో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పలు వాహనాలతో పాటు షాపులు ధ్వంసమయ్యాయి. పేలుడు అనంతరం అనర్కలీ మార్కెట్‌ను మూసివేశారు.
పాకిస్థాన్‌లో బాంబు పేలుడు
- విదేశం
- January 20, 2022
లేటెస్ట్
- లగచర్లలో కలెక్టర్ పై దాడి చేయించింది కేటీఆరే : ఎమ్మెల్యే బాలు నాయక్
- ఇండ్ల స్థలాల కేటాయింపులో జాప్యం వద్దు
- సర్కార్ బడిలో ట్యాబ్ పాఠాలు
- బుగ్గరామలింగేశ్వర జాతరకు వేళాయే..నేటి నుంచి 15 రోజుల వరకు కొండకోనల్లో సందడి
- కోటి దీపోత్సవంలో వేద మంత్రోచ్చరణ
- కేపీహెచ్బీలో దారి దోపిడీ ముఠా హల్చల్
- మున్సిపాలిటీల అప్పులూ ఎక్కువే
- పెండ్లి బరాత్ లో డ్యాన్స్ చేస్తూ .. యువకుడు మృతి
- ప్రముఖ కంపెనీల పేరుతో కల్తీ నీటి దందా
- పోలీసులు ఉన్నా.. కలెక్టర్ వెంట ఎందుకు వెళ్లలేదు : ఏడీజీ మహేశ్ భగవత్
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శాటిలైట్‌తో సిగ్నల్స్
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సిద్దిపేట ట్రాఫిక్ ACP వీరంగం
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!