ముగ్గురు రైల్వే సిబ్బంది మృతి
భువనేశ్వర్: ఒడిశాలోని రాయగడ వద్ద హౌరా–జగదల్పూర్-–సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్ మంగళవారం పట్టాలు తప్పింది. రైలు ఇంజన్‌తో పాటు ఫ్రంట్గార్డ్బోగి, సెకండ్ క్లాస్బోగీలు పట్టాలు తప్పి, పక్క ట్రాక్‌పై ఉన్న మెయింటనెన్స్టవర్ కార్‌ను ఢీకొట్టాయి. దీంతో ఇంజన్లో మంటలు రేగాయి. రైలు ఢీకొట్టడంతో మెయింటనెన్స్ టవర్ కార్లోని ముగ్గురు రైల్వే సిబ్బంది చనిపోయారని ఈస్ట్‌కోస్ట్‌రైల్వే అధికార ప్రతినిధి జేపీ మిశ్రా చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదన్నారు. ఈ ఘటనపై కమిషనర్ఆఫ్రైల్వే సేఫ్టీ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినట్లు మిశ్రా వివరించారు.