హైదరాబాద్లో 3 లక్షల 79 వేల వీధి కుక్కలు

వీధి కుక్కుల ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. కుక్కల దాడులను నివారించడానికి  ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. ఈ సందర్భంగా.. GHMC పరిధిలో 3 లక్షల 79 వేల స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయని కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. డాగ్స్ అటాక్స్ నివారించేందుకు స్టేట్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.  

హైదరాబాద్ లోని ఆరు కేంద్రాల్లో డాగ్స్ కు స్టెరిలైజేషన్ చేస్తున్నామన్నారు.  ఇక నాగ్ పూర్ తరహాలో డాగ్స్ ను షెల్టర్ హోమ్స్ కి తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని కోర్టుకు తెలిపారు యానిమల్ వెల్ఫేర్ తరపున న్యాయవాది. ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. నిన్న జవహర్ నగర్ లో కుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు  చనిపోయాడు.