భద్రాచలంలో రూ.3 లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో మంగళవారం ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భూపాల్‌పల్లి జిల్లా కేంద్రానికి తరలిస్తున్న రూ. 3 లక్షల విలువ చేసే 16.8  కిలోల  ఎండుగంజాయిని ఖమ్మం ఎక్సైజ్​అండ్​ఎన్‌ఫోర్స్‌మెంట్  సీఐ సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు.

  హోండా బైక్​, మొబైల్​ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఎక్కాల యశ్వంత్​, మొఖడి అజయ్‌లను అరెస్టు చేశారు. దాడుల్లో ఎస్సైలు ముబాషీర్, అహ్మద్, అనిల్‌లతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు కరీం, బాలు తదితరులు పాల్గొన్నారు.