3 లక్షల ట్రాఫిక్ కేసులు నమోదు.. మీ బండి ఉందేమో చెక్ చేసుకోండి..

3 లక్షల ట్రాఫిక్ కేసులు నమోదు.. మీ బండి ఉందేమో చెక్ చేసుకోండి..

లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. లెక్కచేయట్లే!

ఏ పనిలేకున్నాబయటకొస్తున్నరు
రూల్స్ బ్రేక్ చేస్తూ పోలీసులకు చిక్కుతున్నరు
‘టీఎస్ కాప్’ లో వెహికల్స్ డేటా అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్

హైదరాబాద్,వెలుగు: కరోనా వైరస్ భయాందోళన సృష్టిస్తుంటే సిటీలో రోజు వేలల్లో లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నరు. పోలీసుల నిఘా తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని రోడ్లపై వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో యథేచ్ఛగా తిరుగుతున్నరు. నిత్యావసరాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇష్టమొచ్చినట్లు బయటకు వస్తున్నరు. చెక్ పోస్ట్ ల వద్ద డ్యూటీలో ఉన్న పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకుంటున్నరు. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి గ్రేటర్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో రోజుకు సగటున 28 వేల వెహికల్స్ రోడ్డెక్కాయి. గడిచిన వారం రోజుల్లో 2.8 లక్షల వెహికల్స్ పై ట్రాఫిక్ పోలీసులు ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇవే కాకుండా పోలీస్ చెకింగ్స్, సీసీ కెమెరాలకు చిక్కకుండా  సిటీ రోడ్లపై యువత వెహికల్స్ తో తిరుగుతూనే ఉన్నరు.

20 శాతం మంది రోడ్లపైకి..
చెక్ పోస్టుల వద్ద చెకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో పోలీసులు వాహనదారుల డేటాను ‘టీఎస్ కాప్’ లో అప్ లోడ్ చేస్తున్నారు. టూ వీలర్ పై ఒకరి కంటే ఎక్కువ మంది , కార్లలో ముగ్గురు ట్రావెల్ చేసినా కేసులు నమోదు చేస్తున్నారు. నిత్యావసర, మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంబంధ అవసరాల కోసం తప్ప ఇతర పనులపై వచ్చే వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ –1897 కింద సీజ్ చేసి స్థానికి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం రిలీజ్ కు చర్యలు తీసుకుంటారు. ఇలా రోజు రోడ్డెక్కుతున్న వారిలో కేవలం 35 శాతం మంది మాత్రమే నిత్యావసరాలు, అత్యవసర పరిస్థితిలో ఇండ్ల నుంచి బయటికి వస్తున్నారు. సిటీ రోడ్లపై తిరిగే వారిలో 45 శాతం మంది ఎసెన్సియల్ సర్వీసుల్లోని మెడికల్ సిబ్బంది, శానిటేషన్, సోషల్ వర్కర్స్ ఉన్నారు. మరో 20 శాతం మంది అనవసరంగా రోడ్లపైకి వస్తున్నట్టు గుర్తించినట్లు పోలీసులు చెప్తున్నారు.

మీ బండి మీద ఫైన్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ చలాన్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ బండి నంబర్ ఎంటర్ చేస్తే.. మీరు ఎక్కడ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారో తెలుస్తుంది.

For More News..

రద్దు చేయడం కన్నా మినీ ఐపీఎల్ బెటర్

కరోనా ఎఫెక్ట్: పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే ఇవి ఉండాల్సిందే

కరోనా దెబ్బకు ఎంసెట్ కూడా వాయిదా?

కరోనా చావులతో రికార్డుకెక్కిన అమెరికా.. ఒక్కరోజులోనే..