ఏటూరు నాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సమక్షంలో ఇవాళ ముగ్గురు మావోయిస్టుల లొంగిపోయారు. తెలంగాణ సరిహద్దు చత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలోని గ్రామాల నుంచి మద్వి ఆదామ కమలేష్ (32), సుంకరి నారాయణ (30), సుంకరి సుధాకర్ (35) లొంగిపోయారు.
ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కథనం ప్రకారం.. వారి ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుని సాధారణ జీవితం గడపడానికి మావోయిస్టు పార్టీని వీడినట్టు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని.. వారి కుటుంబసభ్యుల భవిష్యత్కోసం పనిచేయాలని లొంగిపోయారని తెలిపారు. మిలీషియా సభ్యులందరికీ అవసరమైన సహాయం అందించడానికి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వీరు వెంకటాపురం పోలీసుల ఆధ్వర్యంలో లొంగిపోగా, ఎస్ఐ కొప్పుల తిరుపతిని అభినందించారు.