ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో కోచింగ్ సెంటర్ బయట యువతులను వేధించిన ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఏం చేశారో తెలియదు. నిందితులను మీడియా ముందుకు తీసుకొచ్చిన క్రమంలో నడవడానికి కూడా పనికిరాని స్థితిలో ఆ ఆకతాయిలు కనిపించారు. నిందితులు పోలీసుల భుజాలపై అటో చేయి, ఇటో చేయి వేసి నడవలేని స్థితిలో మీడియాకు కనిపించారు. యువతులను వేధించినందుకు ఈ ఆకతాయిలకు పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి ఫుల్ కోటింగ్ ఇచ్చినట్లు ఈ పరిణామం చెప్పకనే చెప్పింది.
UP के मुज़फ्फरनगर की पॉश कही जाने वाली गांधी कॉलोनी में दिन दहाड़े कोचिंग सेंटर के बाहर लड़कियों से छेड़खानी करने वाले नकाबपोश शोहदे उज्जवल और शोभित शर्मा को 3 घंटे के अंदर पुलिस ने अरेस्ट कर इनका मुकम्मल ट्रीटमेंट किया है। अभी इनका एक दोस्त फरार है.. जिसके बारे में पुलिस का… pic.twitter.com/FkybywiS48
— TRUE STORY (@TrueStoryUP) August 2, 2024
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లో అమీర్పేట్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో ఉన్నట్టుగా ముజఫర్నగర్లోని గాంధీ కాలనీలో కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది యువతీయువకులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ, ఐటీ ఉద్యోగాల కోసం అక్కడి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటారు. అయితే.. యువతులను కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారనే సమాచారం పోలీసులకు ఉండటంతో ఈ ప్రాంతంలో పోలీసులు రెగ్యులర్గా రౌండ్స్ తిరుగుతూ, పెట్రోలింగ్ చేస్తూ ఉండేవారు. అయితే.. గత కొద్దిరోజులుగా పోలీసులు కన్వర్ యాత్ర డ్యూటీలో బిజీగా ఉండటంతో ఆకతాయిలు మళ్లీ రెచ్చిపోయారు.
ఒక కోచింగ్ సెంటర్ బయట నిల్చున్న యువతుల దగ్గరకు బైక్పై ముగ్గురు యువకులు వెళ్లారు. పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు కర్చీఫ్లు కట్టుకుని ముఖాన్ని కవర్ చేసుకున్నారు. యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, బెదిరించారు. ఒక యువతి చేతులెత్తి దణ్ణం పెట్టి తమను వదిలేయాలని వేడుకుంది. ఆ తర్వాత గానీ ఆ ఆకతాయిలు అక్కడ నుంచి కదల్లేదు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ALSO READ | పిల్లనిచ్చిన మామే యముడు.. IRS అల్లుడుని కాల్చి చంపిన IPS మామ
బాధిత యువతుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలించారు. మోహన్ భాటియా కోచింగ్ సెంటర్ ముందు యువతులను ఏడిపించిన ఆ ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన ఆ ఇద్దరి నిందితులకు పోలీసులు లాఠీలతో మర్యాద చేసినట్టుగా నిందితులు మీడియా ముందుకొచ్చిన దృశ్యాలు చూస్తే స్పష్టమైంది.