ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య.. రెవెన్యూ అధికారుల మోసానికి కుటుంబం బలి

ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య.. రెవెన్యూ అధికారుల మోసానికి కుటుంబం బలి

కడప జిల్లాలో దారుణం జరిగింది. రెవెన్యూ అధికారులు చేసిన మోసానికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో జరిగింది. కొత్త మాధవరం గ్రామానికి చెందిన సుబ్బారావు చేనేత కార్మికుడు. శనివారం ఉదయం అతని భార్య పద్మావతి, కూతురు వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా సుబ్బారావు ఒంటిమిట్ట చెరువుకట్ట వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించగా సూసైడ్ నాట్ లభ్యమైందని తెలిపారు.

సుబ్బరాకు చెందిన మూడెకరాల పొలాన్ని అమ్మాలని భావించగా అది రికార్డ్స్ లో వేరేవాళ్ళ పేరు మీద ఉండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ లో రాసి ఉందని పోలీసులు తెలిపారు. రెవెన్యూ అధికారులు మోసం చేసారని, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారని, రెవెన్యూ అధికారులు భూమిని ఆన్లైన్ చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహించారు, భూమిపై ఉన్న సమస్యలు ఏంటి అన్న అంశాలపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.