జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చింది. ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా సిబ్బందికి వచ్చిన సమాచారంతో.. దక్షిణా కశ్మీర్ జిల్లాలోని క్వారిగం, రాణిపోరా ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్‌ను నిర్వహించారు.
భద్రతా సిబ్బంది తనీఖీలు చేస్తోన్న సందర్భంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులతో విరుచుకుపడ్డారు. వెంటనే భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై ఎదురుకాల్పులును జరిపింది. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదుల వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.