ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో 30 లక్షల కుక్కలను చంపుతున్నారు. ఇప్పటికే లక్షల కుక్కలను చంపేసినట్లు తెలుస్తోంది. మొత్తం 30 లక్షల కుక్కలను చంపాలని ఆపరేషన్ ప్రారంభించింది మొరాకో దేశం. మొరాకో తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జంతు ప్రేమికులు ఇది అమానవీయ చర్య అని, దీన్ని ఎలాగైనా ఆపాలని నినదిస్తున్నారు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 లక్షల కుక్కలను చంపాలనే నిర్ణయం వెనుక ఉన్న కారణం.. ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2030). మొరాకోలో 2030లో ఫిపా ప్రపంచ కప్ నిర్వహించనున్నారు. అందులో భాగంగా 2030 వరకు ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని నిర్ణయించారు. వీధికుక్కలను చంపేసీ దేశ వీధులను క్లీన్ గా ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.
ALSO READ | ఛాతీపై బంతి తగిలి మరణించిన 16 ఏళ్ల గోల్ కీపర్
ఫుట్ బాల్ వరల్డ్ కప్ (FIFA World Cup) అంటే ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న ఈవెంట్. 2030లో స్పెయిన్, పోర్చుగల్ దేశాలతో పాటు మొరాకో ఈ ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. అందులో భాగంగా ఈ ఆట చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో ఈ దేశాలకు తరలి రానున్నారు. అందుకోసం మొరాకో వీధులను కుక్కలు లేకుండా క్లీన్ గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొరాకో ప్రకటించింది.
మూడు మిలియన్ల వీధి కుక్కలను చంపాలనే మొరాకో నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రపంచ జంతు ప్రేమికుల సంఘం మొరాకో చర్యను దారుణమైన చర్యగా ప్రకటించింది. ఇప్పటికే మొరాకోలో ఏటా 3 లక్షల కుక్కలను చంపుతున్నారని, ఇప్పుడు 30 లక్షల వీధి కుక్కలను చంపాలనే నిర్ణయం చాలా దారుణమైనదని ప్రకటించింది.