ఒక ఓవర్ లో ఒకటి లేదా రెండు నో బాల్స్ చూడడం సహజం. ఒక్కోసారి పేస్ బౌలర్లు అదుపుతప్పి మూడు బాల్స్ వేస్తారు. అయితే ఒక స్పిన్నర్ మూడు నో బాల్స్ వేయడం ప్రస్తుతం చర్చనీయాంశయంగా మారింది. ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన జరిగింది. లక్నో స్పిన్నర్ M సిద్ధార్థ్ ఏకంగా మూడు నో బాల్స్ వేసి ఐపీఎల్ లోనే అత్యంత చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు.
గుజరాత్ ఇన్నింగ్స్ 5 ఓవర్లో సిద్ధార్థ్ లైన్ అండ్ లెంగ్త్‌తో ఇబ్బంది పడ్డాడు. తొలి మూడు బంతుల్లో ఒకటే పరుగు ఇచ్చిన ఈ యువ స్పిన్నర్.. నాలుగో బంతికి వేసే క్రమంలో వరుసగా రెండు నో బాల్స్ విసిరాడు. ఆ తర్వాత ఆరో బంతిని వేసే క్రమంలో మరో నో బాల్ వేయడంతో మొత్తం మూడు నో బాల్స్ వచ్చాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒక స్పిన్నర్ ఒకే ఓవర్లో అత్యధిక (3) నో బాల్స్ వేసిన బౌలర్ గా సిద్ధార్ధ్ చెత్త రికార్డ్ ను మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు అమిత్ మిశ్రా, అనీల్ కుంబ్లే, యోగేష్ నగర్ రెండు నో బాల్స్ వేశారు.
సిద్ధార్థ్ మూడు నో బాల్స్ వేసిన ఫ్రీ హిట్ రూపంలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం. ఈ ఓవర్ లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ లో ఈ లెఫ్టర్మ్ స్పిన్నర్ కు వికెట్ దక్కపోయినా పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 163 రన్స్ చేసింది. 164 పరుగులు లక్ష్య ఛేదనలో గుజరాత్ 130 పరుగులకే పరిమితమైంది.
Manimaran Siddharth bowled 9 balls to complete his 3rd over against Gujarat#IPL2024 https://t.co/C4jTt1JYt1
— India Today Sports (@ITGDsports) April 7, 2024