ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: బీఆర్ఎస్​ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు ఔట్​సోర్సింగ్ ఉద్యోగులను అధికారులు సర్వీస్ ​నుంచి తొలగించారు. మహబూబ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్​లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జాజాపూర్ సుదీప్ రెడ్డి డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అలాగే ఆర్టీవో ఆఫీసులో ఎ శరత్ గౌడ్ డేటా ఎంట్రీ ఆపరేటర్.

వీరితో పాటు బండమీదిపల్లికి చెందిన మహాలక్ష్మి గ్రూప్ రీసోర్స్ పర్సన్ ముడావత్ లాలమ్మ ఈ మధ్య బీఆర్​ఎస్​ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీరు ప్రచారంలో పాల్గొన్నట్లు ఫొటోలతో రుజువు చేయడంతో విధుల నుంచి తొలగిస్తూ సంబంధిత శాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటే సర్వీస్ నుంచి తొలగిస్తామని అధికారులు హెచ్చరించారు.