గుడ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

గుడ్ న్యూస్:  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  డీఏ పెంపు

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ముందు గుడ్ న్యూస్.  ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతూ  అక్టోబర్ 16న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి  ఉంది. డీఏ పెంపుతో  కోటి మందికి పైగా  ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.   3 శాతం డీఏ పెంపుతో ఉద్యోగుల డియర్​నెస్​ అలొవెన్స్​ (డీఏ) 50 శాతం నుంచి 53  శాతానికి చేరనుంది. 

పెరుగుతున్న ధరలకు పరిహారంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ ఇస్తారు. ఏడాదికి రెండుసార్లు  ప్రభుత్వ ఉద్యోగులకు ,పెన్షనర్లకు డీఏ ఇస్తారు.  ఈ ఏడాది మార్చిలో డీఏ 4శాతం పెరిగింది. ఇది జనవరి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. మూడు నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది.  డీఏ పెంపు ప్రకటన అక్టోబర్  చివరిలో వస్తే.. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలతో కలుపుకుని జీతం అందుతుంది.పండుగల సీజన్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పెద్ద ఊరటనిస్తుంది.