ఢిల్లీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి

ఢిల్లీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి

ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో  అగ్నిప్రమాదం జరిగింది. షాయం కృపా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల వ్యాపించి ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదం లో ముగ్గురు కార్మికులు సజీవ దహనం కాగా..మరో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం తెల్లవారు జామున 3.35 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో తొమ్మిది మంది కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ బర్నర్లపై ముడి మూంగ్ ను కాల్చుతుండగా.. గ్యాస్ పైప్ లైన్లో ఒకదానినుంచి గ్యాస్ అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మంటలు  వ్యాపించి కంప్రెషర్ వేడెక్కడంతో పేలుడు జరిగిందని గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు తులను శ్యాం(24), రామ్ సింగ్ (30)చ బీర్పా(42) లుగా గుర్తించారు.

గాయపడిన వారు ఆకాష్ (19), మోహిత్ కుమార్ (21), పుష్పేందర్ (26),  రవికుమార్ (19), మోను (25), లాలూ (32)గా గుర్తించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.