టెక్నో నుంచి 3 ఫోన్లు..ఫీచర్లు ఇవే

స్మార్ట్​ ఫోన్ల మేకర్​ టెక్నో ... కేమన్ 20, కేమన్ 20 ప్రో 5జీ,  కేమన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్లను ఇండియా మార్కెట్లో లాంచ్​ చేసింది. కొత్త సిరీస్ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లలో మీడియాటెక్​ ప్రాసెసర్లు, 6.7 ఇంచుల అమోలెడ్​ డిస్​ప్లే,  5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటాయి.  

ఖరీదైన కేమన్ 20 ప్రీమియర్ ధర వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కేమన్ 20 హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్​లో 8జీబీ + 256జీబీ ర్యామ్ ఉంటాయి. ధర  రూ. 14,999. కేమన్ 20 ప్రో 5జీ ధర 8జీబీ + 128జీబీ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 19,999 కాగా, 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 21,999. రెండు హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జూన్ రెండవ వారం నుంచి అమ్మకానికి వస్తాయి.