కర్నూలు జిల్లాల్లో ఘోరం జరిగింది. జిల్లాలోని ఆదోని మండలం చిన్న పెండేకల్ లో బోరుబావిలో పేలుడు సంభవించటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. పెండేకల్ గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో కొత్తగా వేసిన బోరుబావిలో పైపులు దించుతుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
బోరు బావిలోకి పైపులు దించుతున్న క్రమంలో పేలుడు సంభవించటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయమేమి లేకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలేమిటి, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక పేలుడు వెనక ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
ALSO READ | గోదావరి కుర్రోడిని.. గోవాలో కర్రలతో కొట్టి చంపిన హోటల్ సిబ్బంది