నెల్లూరు: ఈ నెల 22న అంతరిక్షంలోకి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 వాహకనౌక భూ కక్ష్యను మూడవసారి పెంచారు సైంటిస్టులు. శుక్రవారం తెల్లవారు జామున విజయవంతంగా రెండో ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం 3.12 నిమిషాలకు మూడవ ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. సుమారు 989 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత చంద్రయాన్-2 వాహకనౌక 276 x 71792 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. దీంతో చంద్రుడికి చంద్రయాన్ మరింత చేరువైంది. చంద్రయాన్ వ్యోమనౌక అన్ని ప్యారామీటర్లతో సహజంగా వెళ్తున్నట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 2వ తేదీన వ్యోమనౌకకు చెందిన నాలుగవ భూకక్ష్య పెంపు ప్రక్రియను నిర్వహించనున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ఈ ప్రక్రియ ఉంటుందని ఇస్రో చెప్పింది. ఆగస్టు 14 వరకు మిగిలిన కక్ష్యలను పెంచే ప్రక్రియను చేపడతామని ఇస్రో వెల్లడించింది.
#Chandrayaan2
Today after performing the third orbit raising maneuver, we are now 3 steps closer to the moon !!!#ISRO pic.twitter.com/M8iqxwZgZr— ISRO (@isro) July 29, 2019