స్టేషన్​ఘన్​పూర్ మండలంలో 3 టిప్పర్లు సీజ్

స్టేషన్​ఘన్​పూర్ మండలంలో 3 టిప్పర్లు సీజ్

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ మండలం ఇప్పగూడెం శివారులో మొరంమట్టి ఓవర్​ లోడ్​తో వెళుతున్న 3 టిప్పర్లను సీజ్​ చేసినట్లు సీఐ వేణు బుధవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం..ఇప్పగూడెం శివారులోని గుట్ట నుంచి స్టేషన్​ఘన్​పూర్​కు మొరం మట్టి ఓవర్​లోడ్​తో

3 టిప్పర్​ వెహికల్స్​ వెళుతున్నట్లు సమాచారమందుకున్న పోలీసులు వాటిని చాకచక్యంగా పట్టుకున్నారు. పరిమితికి మించి మొరం మట్టిని తరలిస్తున్న టిప్పర్​ వెహికల్స్​ను సీజ్​ చేశారు. చర్యల నిమిత్తం వాటిని మైనింగ్​ డిపార్ట్​మెంట్​ కు అప్పగించినట్లు సీఐ వేణు తెలిపారు