
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా మోమిన్ పేట, నవాబ్ పేట పీఎస్‌ల పరిధిలో అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, మూడు టిప్పర్లు, ఎర్రమట్టి తవ్వుతున్న రెండు జేసీబీలను టాస్క్‌ఫోర్స్‌పోలీసులు సీజ్‌చేశారు.
దేవరంపల్లి శివారులో అక్రమంగా ఎర్ర మట్టి తరలిస్తున్నారనే సమాచారంతో ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మూడు ట్రాక్టర్లు, జేసీబీని సీజ్ చేశారు. అలాగే అర్కతల శివారులో మూడు టిప్పర్లు,జేసీబీని సీజ్ చేశారు.