రాంచీ వేదికగా జరుగుతున్న టెస్టులో ఆకాష్ దీప్ తన టెస్ట్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో అవకాశం దక్కించున్న ఈ యంగ్ పేసర్ తన తొలి టెస్ట్ లోనే అదరగొడుతున్నాడు. మొదటి మూడు వికెట్లు తీసుకొని ఇంగ్లాండ్ ను కష్టాల్లో పడేశాడు. మరో పేసర్ సిరాజ్ విఫలమైనా.. ఈ బెంగాల్ పేసర్ మాత్రం బుమ్రా లేని లోటును తీర్చాడు. మెరుపు బౌలింగ్ తో తన తొలి టెస్టును ఘనంగా చాటుకున్నాడు.
9వ ఓవర్ రెండో బంతికి డకెట్ వికెట్ తీసి భారత్ కు తొలి బ్రేక్ ఇచ్చాడు. 11 పరుగులు చేసిన డకెట్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఓవర్ లో నాలుగో బంతికి పోప్ ను ఎల్బీడబ్ల్యూ గా వెనక్కి పంపి ఒకే ఓవర్లో రెండు వికెట్లను తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇన్నింగ్స్ 11 ఓవర్ 5వ బంతికి క్రాలిని క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. నిజానికి నాలుగో ఓవర్ ఐదో బంతికి క్రాలిని క్లీన్ బౌల్డ్ చేసినా.. అది నో బాల్ గా తేలింది. ఆకాష్ దెబ్బకు పోప్ డకౌట్ కాగా.. జోరు మీదున్న క్రాలి 42 పరుగులు చేసి ఔటయ్యాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజ్ లో జానీ బెయిర్ స్టో (11), రూట్ (5) ఉన్నారు. మూడు వికెట్లు ఆకాష్ దీప్ ఖాతాలోకి వెళ్లాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ కు ఓపెనర్లు తొలి వికెట్ కు 47 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ఆ తర్వాత ఆకాష్ ధాటికి 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
3 wickets for akashdeep 🔥🔥🫡 #INDvsENGTest
— Manoj Bhai (@CricketFever111) February 23, 2024
pic.twitter.com/tHb6tZ1BMV