ముల్తాన్ వేదికగా ఆతిథ్య పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ హోరాహోరీగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 366 పరుగుల వద్ద ఆలౌట్ అవ్వగా.. ప్రస్తుతం ఇంగ్లండ్ 225 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది.
ఒకానొక సమయంలో ఇంగ్లండ్ 224 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉంది. అటువంటి ఇంగ్లండ్ వెన్ను విరిచారు.. పాక్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమన్ అలీ. వీరిద్దరిని ఎదుర్కోవడం పర్యాటక జట్టు బ్యాటర్ల వల్ల కావడం లేదు. పడిన ఆరు వికెట్లూ వీరిద్దరూ తీసినవే. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండం ఒక ఎత్తైతే.. బంతిలో నాలుగించీలు కంటే తక్కువ ఎత్తులో వస్తుండటం మరో ఎత్తు. దాంతో, ఇంగ్లండ్ బ్యాటర్లు వికెట్లకు అడ్డుకట్ట వేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పటివరకూ సాజిద్ ఖాన్ 4, నోమన్ అలీ 2 వికెట్లు పడగొట్టారు.
DOMESTIC CRICKET KO IZZAT DO ❤️❤️❤️
— Farid Khan (@_FaridKhan) October 16, 2024
After Kamran Ghulam, Sajid Khan & Nauman Ali are doing wonders for Pakistan 🇵🇰🔥#PAKvENG #tapmad #DontStopStreaming pic.twitter.com/KVkFbs5MGL
కమ్రాన్ గులామ్ శతకం
అంతకుముందు బాబర్ ఆజాం స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులామ్(118) సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అరంగ్రేట టెస్ట్‌లోనే శతకం బాదాడు. దాంతో, పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులు చేసింది.