బస్తర్​ రేంజ్​లో.. ఈ ఏడాది 91 మంది మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బస్తర్​ రేంజ్​లో 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు జరిపిన వివిధ ఆపరేషన్లలో 91 మంది మావోయిస్టులు చనిపోయారని బస్తర్​ రేంజ్​ఐజీ సుందర్ ​రాజ్ ​పి బుధవారం తెలిపారు. అబూజ్​మాఢ్ ఎన్​కౌంటర్​లో 10 మంది మావోయిస్టులు చనిపోయిన తర్వాత ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. మావోయిస్టు కార్యకలాపాలు దేశంలోనే అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో పట్టు సాధించామన్నారు. అత్యాధునిక ఎల్ఎంజీ ఆయుధాలు రెండు, ఏకే-47లు నాలుగు , ఎస్ఎల్ఆర్​లు ఒకటి, ఇన్​సాస్​లు మూడు, 303 రైఫిల్స్ నాలుగు , 9ఎంఎం పిస్టల్స్ నాలుగు,  మందుపాతరలు, డిటోనేటర్లు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు ఇంకా కొనసాగుతాయని చెప్పారు.