
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోజురోజుకు పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సూపరింటెండెంట్డాక్టర్ రాజకుమారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం ఉన్న 30 బెడ్లకు అదనంగా మరో 30 బెడ్లు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇందులో15 బెడ్లు సర్జికల్, 15 బెడ్లను మెడికల్ట్రీట్మెంట్ విభాగాలకు కేటాయించామన్నారు. గురువారం ఆసుపత్రిలో మెడికల్, పారామెడికల్విభాగాల అధికారులు, హెచ్ఓడీలు, ఆర్ఎంఓలతో ఆమె సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు.