
పద్మారావునగర్, వెలుగు: ఏసీలు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కూలర్లు, గీజర్ల రిపేరింగ్పై 30 రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నామని జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎస్.నరసింహమూర్తి తెలిపారు. భోలక్ పూర్ లోని తమ శిక్షణ కేంద్రంలో టైనింగ్ ఉంటుందన్నారు.
పరీక్షలు రాసి ఖాళీగా ఉన్న స్టూడెంట్లు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణలో భాగంగా 15 రోజుల హోం క్లీనింగ్ కోర్సు అందిస్తున్నామని తెలిపారు. 16 ఏండ్లు దాటిన ప్రతిఒక్కరూ అర్హులేనని చెప్పారు. వివరాలకు ఎం.శ్రీనివాస్(81068 87523)ను సంప్రదించాలని కోరారు.