అదిలాబాద్: పెద్ద కొండ చిలువలు చెట్లు ఎక్కగలవు కానీ ఆ దృశ్యం అరుదు. చాలా తక్కువ సందర్భాల్లోనే కొండ చిలువలు చెట్లు ఎక్కుతాయి. పచ్చని అడవి అందాలకు నిలయం అయిన అదిలాబాద్ జిల్లాల్లో ఓ పెద్ద కొండ చిలువ చెట్టు చుట్టూ చుట్టుకుంటూ దాదాపు 30 అడుగుల మహా వృక్షం ఎక్కేసింది.
కొమురం భీం జిల్లా బెజ్జుర్ మండలం ఏటిగూడా మానిక దేవర అటవీ ప్రాంతంలో అది జరిగింది. దాన్ని కొందరు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. కొండ చిలువ పాము చెట్టు పైకి ఎక్కుతుండగా వీడియో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ALSO READ | డ్రగ్స్ మత్తులో మొసళ్లు!! ..నీళ్లలోంచి దూసుకొస్తున్నయ్