వికారాబాద్ ​జిల్లాలో 30 కేజీల గంజాయి సీజ్

వికారాబాద్ ​జిల్లాలో 30 కేజీల గంజాయి సీజ్

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ​జిల్లాలో మంగళవారం సాయంత్రం రెండు గంజాయి కేసులు నమోదయ్యాయి. తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడనే సమాచారంతో జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. 

ఒడిశాకు చెందిన  శిభారం స్వైన్ ను అరెస్టు చేసి, 2 కేజీల ఎండు గంజాయిని సీజ్ చేశారు. అలాగే తాండూరులో గుర్తు తెలియని వ్యక్తి దాచి ఉంచిన16 కేజీల ఎండు గంజాయి, 2  కేజీల పౌడర్  ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ ​తెలిపారు.