దేవుడా ఏంటిది : పాలమూరు జిల్లాలో భూ ప్రకంపనలు

బుధవారం ( డిసెంబర్ 4, 2024 ) హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వచ్చిన భూప్రకంపనలు మరువక ముందే.. ఇవాళ ( డిసెంబర్ 7, 2024 )  ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మరోసారి భూమి కంపించింది. పాలమూరు జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.0గా నమోదయ్యింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు.

అయితే.. ఈ భూప్రకంపనల వల్ల పెద్ద ప్రమాదమేమీ జరగకపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావొద్దని.. పగుళ్లు ఉన్న బిల్డింగ్స్, పాత బిల్డింగ్స్ లలో ఉండకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. భూకంపాల పరంగా హైదరాబాద్ సేఫ్​జోన్‎లోనే ఉన్నట్టు సెంటిస్టులు చెప్తున్నారు. తెలంగాణకు భూకంపాల భయంలేదని, మన ప్రాంతం దక్కన్‌‌ పీఠభూమిలో సముద్రానికి ఎత్తులో ఉందని, ప్రజలు నిర్భయంగా ఉండొచ్చంటున్నారు. భూమి కంపించడం అనేది సర్వ సాధారణం. అయితే, ఏ స్థాయిలో ప్రకంపనలు వస్తున్నాయన్న దాన్ని బట్టి దేశాన్ని నాలుగు కేటగిరీలుగా విభజించారు. 

Also Read :- వీడెవడ్రా బాబు.. అంబులెన్స్‎నే ఎత్తుకెళ్లాడు

అంటే, ఎంత తీవ్రతతో భూమి కంపిస్తే, ఎంత నష్టం జరుగుతుందో చెప్పే ఒక టేబుల్‌‌ ఇది. రిక్టర్‌‌ స్కేలుపై 7 తీవ్రతతో భూమి కంపిస్తే జోన్-5గా, 6-–7 రేంజ్‌‌లో వస్తే జోన్- 4గా, 5తో వస్తే జోన్- 3గా, 1 – 4 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉంటే దాన్ని జోన్-2. వీటిలో జోన్-5 అత్యంత భూకంప ప్రభావమున్న ప్రాంతం. జోన్ 2లో  సాధారణంగా భూకంపాలు రావు. ఈ జోన్ 2లోనే మన హైదరాబాద్ ఉందని సైంటిస్టులు తెలిపారు.