ఛత్తీస్ గఢ్ దంతెవాడలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీ ప్రాంతంలో అక్టోబర్ 4 ఉదయం నుంచి పోలీసులకు మావోలకు మధ్య కూంబింగ్ జరుగుతోంది. ఇప్పటికే మావోయిస్టుల దగ్గర నుంచి భారీగా ఆటోమేటిక్ వెపన్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి కేంద్ర బలగాలు.
చత్తీస్ గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ప్రస్తుతం ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్. కేంద్ర బలగాలకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదన్నారు.
Chhattisgarh: 30 naxals killed so far in the encounter with Police in Maad area on Narayanpur-Dantewada border. A huge amount of automatic weapons recovered. Search operation is underway. Further details awaited. pic.twitter.com/3tweIUd6YX
— ANI (@ANI) October 4, 2024